యేసు వంశము-కుటుంబము
- ప్రధాన వ్యాసం: యేసు వంశము
నాలుగు సువార్తలలో, మత్తయి మరియు మార్కు సువార్తలలో మాత్రమే యేసు యొక్క వంశ వృక్షం వివరించబడంది.మత్తయి సువార్త యందు యేసు తండ్రియైన యోసేపు యొక్క పితరుల గురించి వివరించబడింది; లూకా యేసు తల్లిదండ్రుల ఇద్దరి వంశ వృక్షాలను మరియొక విధంగా యేసు తల్లియైన మరియ.[4] యొక్క పితరుల వివరాలన్ని వ్రాసాడు. ఏ విధంగా చూసినా, యేసు యొక్క వంశ మూలపురుషులుగా రాజైన దావీదు మరియు అబ్రహాములను గమనించగలం.అబ్రహాము దావీదుల మధ్య ఉన్న మూల పురుషుల జాబితాలో యే విధమైన మార్పు ఉండదు గాని,దావీదు నుండి యోసేపు వరకు వ్రాయబడిన మూల పురుషుల జాబితాలో తేడా కనిపిస్తుంది.మత్తయి సొలోమోను తో ప్రారంభించి యూదా గోత్రములోని చివరి రాజైన యెకోన్యావరకు ప్రస్తావిస్తాడు. యెకొన్యా తరువాత రాజుల వంశ పరంపర బాబిలోన్ యూదాను జయించుటతో ఆగిపోతుంది. దీని ద్వారా మత్తయి యేసును ఇశ్రాయేలు సింహాసన వారసునిగ నిరూపిస్తాడు. లూకా వ్రాసిన వంశవృక్షము అబ్రహాము కంటే ముందుకు సాగి ఆదాము-హవ్వ లవరకు సాగి, దావీదు యేసు క్రీస్తులకు మధ్య అనేక పేర్లు చేర్చబడ్డాయి. యోసేపు పేరు యేసు బాల్య బదినముల ప్రస్తావనలో మత్రమే వినిపిస్తుంది. యేసు తల్లియైన మరియను ప్రేమించిన శిష్యుడు యోహాను కు అప్పగించడాన్ని బట్టి యేసు తన సేవను ప్రారంభించుటకు మునుపే యోసేపు చనిపోయి ఉంటాడని అర్థం చేసుకోవాలి. (యోహాను|19:25-27|యోహాను19:25–27), [5] నూతన నిభందన గ్రంధాలైన మత్తయి సువార్త, మార్కు సువార్త మరియు గలతీయులకు వ్రాసిన పత్రికల ద్వారా యేసుకు బందువులు, సోదరులు మరియూ సోదరీమణులు ఉన్నారని గ్రహించగలం.[6] గ్రీకు భష లోని adelphos అనే పదం, సోదరుడుగా అనువదించ బడింది. ఈ పదం దగ్గరి బందుత్వాన్ని తెలియ చేస్తుంది. కతోలికులు మరియు తూర్పు ఛాందస క్రైస్తవులు ఈ పదాన్ని రక్త సంబందికునిగా లేదా దగ్గరి బందువుగా అన్వయించారు.(see మరియ కన్యత్వం).
No comments:
Post a Comment