Search This Blog

Monday, January 18, 2010

పుట్టుక మరియు ప్రారంభ జీవితం

ప్రధాన వ్యాసాలు: ప్రకటన, యేసు పుట్టుక & బాల యేసు

Adoration of the Shepherds, Gerard van Honthorst , 17th c.

మత్తయి మరియు లూకా సువార్తల ప్రకారం యేసు బెత్లహెం అను యూదా ప్రాంత పల్లెలోమరియ, అను కన్యకకు, పరిషుద్దాత్ముని అద్భుత కార్యం గా జన్మించాడు.లూకా సువార్త లో గబ్రియేలుఅని పిలువ బడిన దేవదూత మరియను దర్శించి దేవుడు మరియను తన కుమారునిగర్భమునందు మోయుటకు ఎన్నుకొన్నాడని తెలిపిన ఉదంతాన్ని వివరంగా చూడగలం. (లూకా 1:26–38). లూకా సువార్త ప్రకారం కైసర్ ఔగుస్తుస్ ఆజ్ఞ వలన యోసేపు మరియలు తాము కాపురమున్న నజరేతును విడిచి యోసేపు పితరుడైన దావీదు యొక్క గ్రామమైన బెత్లెహేము కు తమ పేర్లను జన సంఖ్యలో వ్రాయించుకొనుటకు వెళ్ళారు.యేసు జన్మించినపుడు సత్రంలో వారికి స్థలము లేనందున పశువుల తొట్టె లో యేసును పరుండ బెట్టారు. (లూకా 2:1–7). లూకా సువార్త ప్రకారం, ఒక దేవ దూత యేసు జన్మించిన వార్తను గొల్లలకు తెలిపింది. అది విన్న ఆ గొల్లలు యేసును చూచి ఆ వార్తను ఆ ప్రదేశమంతట ప్రచురించారు.మత్తయి కూడా తన సువార్త యందు "జ్ఞానులు" ఆకాశములో ఉదయించిన వింత నక్షత్రము ద్వారా నడిపించబడి వచ్చి యేసును దర్శించి తమ విలువైన బహుమతులను యేసుకు సమర్పించుట ద్వారా మెస్సియా, లేదా యూదుల రాజు, పుట్టాడని గ్రహించారని వ్రాసాడు.(మత్తయి 2:1-12) యేసు పుట్టిన పిదప వారు దూతచే భోదించబడిన వారై హేరోదు యొక్క ఉగ్రత నుండి తప్పించుకొనుటకై ఈజిప్టు కు పారిపోయారు. యేసు బాల్యంనందు గలలియ లోని నజరేతుఅను ఊరిలో పెంచబడ్డాడు. లూకా సువార్త ప్రకారం, యోసేపు మరియలు యేసు జననానికి ముందు నజరేతు నందు జీవించారు. ఆ తరువాత తిరిగి నజరేతుకు వచ్చి అక్కడ నివసించారు. మత్తయి సువార్త ప్రకారం వారి కుటుంబం హేరోదు మరణ పర్యంతం ఈజిప్టు నందు నివసించారని వ్రాయబడి ఉంది. (మత్తయి|2:19-23|మత్తయి 2:19-23). ఈజిప్టుకు పారిపోవుట గాక తూరు మరియు సీదోనులకు వెళ్ళుట మినహా, యేసు జీవితంలోని అన్ని సంఘటనలు పూర్వ ఇశ్రాయేలు దేశము మరియు యూదా ప్రాంతములయందే జరిగినవి. [7] లూకా సువార్త ప్రకారము (బైబిలు వచనం||లూకా|3:23) యేసు ముప్పది యేండ్ల ప్రాయము వాడైనప్పుడు బాప్తీస్మము పొందెను. యేసు బాప్తీస్మము పొందుటకు ముందు ఆయన బాల్యానికి మధ్య ఒక సారి దేవాలయములో కనబడుట తప్ప మరి యెప్పుడు ఆయన గురించి ఏ సువార్తలోను ప్రస్తావించ బడలేదు. (లూకా|2:41-52|లూకా 2:41–52). మార్కు సువార్త యందు యేసు వడ్రంగివానిగా పిలువ బడెను. (బైబిలు వచనం||మార్కు|6:3), మరియు మత్తయి సువార్త యందు వడ్రంగి వాని కుమారునిగా పిలువ బడ్డాడు. (బైబిలు వచనం||మత్తయి|13:55),దీనిని బట్టి యేసు ఆ మధ్య కాలంలో వడ్రంగం పని చేసి ఉండి ఉంటాడని భావించ వచ్చు.

'యేసు బాప్తీస్మము పొందుట మరియు శోధనను జయించుట.'

మార్కు సువార్త యేసు యోహాను ద్వారా బాప్తీస్మము పొందడంతో ప్రారంభించబడింది.దీనిని బైబిలు పండితులు యేసు యొక్క పరిచర్య ప్రారంభంగా వర్ణిస్తారు. మర్కు సువార్త ప్రకారం యోర్దాను నదిలో ప్రజలకు బప్తీస్మమిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్న యోహాను యొద్దకు యేసు బాప్తీస్మము పొందడానికి వచ్చాడు. కాని మత్తయి సూవార్త యందు "తన యొద్దకు బాప్తీస్మము పొందడానికి వచ్చిన యేసును చూసిన యోహాను తనకు యేసునే బాప్తీస్మమిమ్మని అడుగగా, యేసు ఇప్పటికి నీతి నెరవేరునట్లుగా తనకు యోహానునే బాప్తీస్మమిమ్మని" అడిగినట్లు వివరించబడింది. యేసు బాప్తీస్మము పొంది నీటి నుండి లేచినప్పుడు, ఆకాశము తెరువబడుటయు,దేవుని ఆత్మ పావురము వలే దిగివచ్చుటయూ చూచెను. అంతలో పరలోకము నుండి ఒక స్వరము "ఇతడు నా ప్రియ కుమారుడు. ఇతని యందు నేనానందించు చున్నాను" అని పలుకుట వినెను. బాప్తీస్మము పొందిన పిదప యేసు దేవుని వలన అరణ్యములోనికి కొనిపోబడి, అక్కడ 40 దినములు, రాత్రులు ఉపవాసముండెను.ఈ సమయమందు సాతాను యేసును శోధించెను. యేసు సాతాను శోధనలను దేవుని వాక్యమును ఉదహరించుట ద్వారా జయించెను.అంతట సాతాను యేసును విడిచి పోయెను.అంతట దేవ దూతలు వచ్చి యేసుకు ఉపచారము చేసిరి. దీనికి సంబందించిన వివరములను యోహాను సువార్త యందు పొందు పరచబడలేదు.

No comments:

Post a Comment